తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్​కాల్​ చేశాడు.. సీసీ కెమెరాకు దొరికాడు! - హత్యకేసు

మహిళ హత్యకేసును మెదక్​ పోలీసులు కేవలం ఐదు రోజుల్లోనే ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీ, చరవాణి ఆధారంగా నిందితుడిని అరెస్టు  చేసి.. రిమాండ్​కు తరలించారు. పాపన్నపేట మండలం నాగ్సాన్​పల్లికి అటవీ ప్రాంతంలో మహిళను హత్యచేసి నిందితుడు పారిపోయాడని మెదక్​ గ్రామీణ సీఐ పాలవెల్లి తెలిపారు.

medak police Chase Women Murder Case With in five days
ఫోన్​కాల్​ చేశాడు.. సీసీ కెమెరాకు దొరికాడు!

By

Published : Aug 24, 2020, 12:55 PM IST

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్​పల్లిలోని నారాయణరెడ్డి కాలనీకి చెందిన గ్యారంగుల సాలమ్మ అనే మహిళ ఆగష్టు 17 నుంచి కనిపించకుండా పోయింది. అంతకు ఒకరోజు ముందు హవేలి ఘనపూర్​ మండలం తొగిటకు చెందన మాచబోయిన మహేష్ మిత్రుడి వివాహానికి హాజరయ్యేందుకు పాపన్నపేట మండలం మల్లంపేటకు వచ్చాడు. అక్కడ ఒక స్నేహితుడి ద్వారా సాలమ్మ మొబైల్​ నెంబర్​ సంపాదించాడు. 17న మహేష్​ సాలమ్మకు ఫోన్​ చేశాడు.

మెదక్​ మండలం మంబోజిపల్లిలో ఉన్నానని చెప్పగా.. అక్కడికి వెళ్లి సాలమ్మను కలిశాడు. అనంతరం ఇద్దరు నాగ్సాన్​పల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరు శారీరకంగా కలిశారు. మహేష్​ వెంటనే మరోసారి కలుద్దామని సాలమ్మను ఒత్తిడి చేశాడు. అందుకు సాలమ్మ డబ్బులు డిమాండ్​ చేసింది. ఈ క్రమంలోని ఇద్దరికి పెనుగులాట జరిగింది. కోపంతో మహేష్​ సాలమ్మపై బండరాయితో దాడి చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.300 తీసుకొని కొల్చారం మండలం పోతంశెట్​పల్లి మీదుగా స్వగ్రామానికి చేరుకున్నాడు.

అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని.. విచారణ చేపట్టారు. మెదక్‌ గ్రామీణ సీఐ పాలవెల్లి, పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు కలిసి జరిపిన విచారణలో మృతురాలి చరవాణికి వచ్చిన ఫోన్​ కాల్స్​ ఆధారంగా నిందితుడి వివరాలు కనుక్కున్నారు. మెదక్​ మండలం మంబోజిపల్లిలో సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి మహేష్​ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకొన్నాడు. నిందితుడిని అరెస్టు చేసి.. రిమాండ్​కు తరలించినట్టు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ

ABOUT THE AUTHOR

...view details