మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగల ధర్మారం చెరువులో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేప పిల్లలు వదిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వచ్చిన తర్వాత రాష్ట్రం చేపల పరిశ్రమగా మారబోతుందన్నారు. కులవృత్తుల బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి పద్మాదేవేందర్ రెడ్డి చాలా కృషి చేస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
'కాళేశ్వరం నీటితో రాష్ట్రం చేపల పరిశ్రమ మారనుంది' - medak mp prabhakar reddy
కాళేశ్వరం నీరు వచ్చిన తర్వాత రాష్ట్రం చేపల పరిశ్రమగా మారబోతోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రామాయంపేట మండలం దొంగల ధర్మారం చెరువులో చేప పిల్లలను ఆయన వదిలారు.
'కాళేశ్వరం నీటితో రాష్ట్రం చేపల పరిశ్రమ మారనుంది'