మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. ఇటీవల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలంతా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు.
మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ పట్టణంలోని ఓ కూరగాయల మార్కెట్‌ను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సందర్శించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. వ్యాపారులంతా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అమ్మకాలు జరపాలని కోరారు. ప్రజలంతా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
medak mla padma devender reddy
మార్కెట్ పరిసర ప్రాంతంలో ప్రతి రోజు రెండు సార్లు శానిటైజ్ చేయాలని ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. వ్యాపారులంతా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అమ్మకాలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాల ఊసే లేదు: చాడ వెంకట్ రెడ్డి