దేవాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని జిల్లాలోని పాపన్నపేట మండలం ఏడుపాయల అమ్మవారిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు.
దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: పద్మా దేవేందర్ రెడ్డి - ఆలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న మెదక్ ఎమ్మెల్యే
మాఘం అమావాస్య.. రాష్ట్ర ప్రజలకు చాలా పవిత్రమైందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పాపన్నపేట మండలం ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యేతో కలిసి దర్శించుకున్నారు. దేవాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
![దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: పద్మా దేవేందర్ రెడ్డి medak MLA padma devender reddy visits edupayala temple today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10585422-302-10585422-1613046062211.jpg)
దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : పద్మా దేవేందర్ రెడ్డి
ఆలయ ఈవో సార శ్రీనివాస్ ఎమ్మెల్యేలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. రాష్ట్ర ప్రజలకు మాఘ అమావాస్య చాలా విశిష్టమైందని నదీ స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శివరాత్రికి అన్ని శివాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పోతంశెట్టి పల్లి నుండి ఏడుపాయలకు వచ్చే రోడ్డు నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.