మెదక్ పట్టణంలోని అజంపురలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం వల్ల ఆ ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్‌గా ప్రకటించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఈరోజు అజంపురలో పర్యటించారు.
'ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యం' - corona updates in medak
కరోనా నిర్మూలనకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమని, అందరూ సహకరించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలో ఆరెంజ్ జోన్‌గా ప్రకటించిన అజంపురలో పర్యటించారు.

అజంపురలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పర్యటన
అజంపుర ప్రజలెవరూ బయటకు రావొద్దని, తమ అవసరాలు తీర్చేందుకు పోలీస్, మున్సిపాలిటీ అధికారులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. దీనిద్వారా ప్రజలకు అవసరమయ్యే నిత్యావసరాలు, కూరగాయలు అందిస్తున్నారని వెల్లడించారు.
కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే లాక్డౌన్ ఒక్కటే మార్గమని, ప్రజలంతా లాక్డౌన్లో ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని పద్మాదేవేందర్ రెడ్డి కోరారు.