ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

వంద శాతం సబ్సిడీపై రొయ్య పిల్లల పంపిణీ - mla Padma Devender Reddy updates on prawns distribution

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు లాభం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 100 శాతం సబ్సిడీపై మెదక్ మండలం రాయిన్‌పల్లి ప్రాజెక్టులో, హవేలీ ఘనపూర్ మండలం పోచారం ప్రాజెక్టులో రొయ్య పిల్లలను ఎమ్మెల్యే వదిలారు.

Medak mla Padma Devender Reddy distributed prawns on 100 per cent subsidy
వంద శాతం సబ్సిడీపై రొయ్య పిల్లల పంపిణీ
author img

By

Published : Dec 4, 2020, 2:21 PM IST

గతంలో ఎన్నడూ లేనివిధంగా మత్స్యకారులను ఆర్థికంగా ఎదిగే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం చేప పిల్లల పంపిణీ చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలో 21 మండలాల్లోని 1,206 చెరువుల్లో దాదాపు 4 కోట్ల 7 లక్షల చేప పిల్లలు వదిలామన్నారు. పోచారం ప్రాజెక్టులో 3లక్షల 12 వేలు, రాయిన్‌పల్లి ప్రాజెక్టులో 74 వేలు, తుప్రాన్, ఘనపూర్ ప్రాజెక్టుల్లో 77 వేల రొయ్య పిల్లలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు.

"మెదక్‌లో మత్స్యకారులకు మార్కెటింగ్ సౌకర్యం కోసం 40 గుంటల స్థలాన్ని కేటాయించాం. త్వరలో మెదక్‌లో మార్కెట్ కట్టిస్తాం. సబ్సిడీ కింద ద్విచక్ర వాహనాలు, వలలు, ట్రేలు, తెప్పలు, ఐస్ బాక్స్‌లు ఇచ్చాం"

-పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే

కార్యక్రమంలో మెదక్ జిల్లా జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ లావణ్య రెడ్డి, హవేలీ ఘన్​పూర్ మండలం ఎంపీపీ నారాయణ రెడ్డి, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details