తెలంగాణ

telangana

ETV Bharat / state

'మెదక్​లో నాలుగు మున్సిపాలిటీలు మావే' - medak mla padma devendar reddy

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయానికి కృషి చేస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

medak mla padma devendar reddy on municipal elections
'మెదక్​లో నాలుగు మున్సిపాలిటీలు మావే'

By

Published : Jan 13, 2020, 12:55 PM IST

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాలుగో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ శ్రీధర్ యాదవ్ ఈ ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సమక్షంలో అనుచరులతో కలిసి తెరాసలో చేరారు.

'మెదక్​లో నాలుగు మున్సిపాలిటీలు మావే'
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తెరాస విజయానికి కృషి చేస్తాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే నిధులన్నీ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details