మెదక్ పట్టణంలోని మార్కెట్లో కూరగాయలు అమ్మేందుకు వచ్చిన రైతును కొట్టిన ఓ పోలీస్ అధికారి తీరును కూరగాయల వ్యాపారులు ఖండించారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు నిరసనగా స్థానిక కూరగాయల సంఘం అధ్యక్షుడు బొద్దుల కృష్ణ ఆధ్వర్యంలో మార్కెట్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రైతును కొట్టడం సమంజసం కాదని... ఈ రోజు పూర్తిగా కూరగాయలు అమ్మడం మానేస్తామన్నారు. విషయం తెలుసుకున్న మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య... వ్యాపారస్తులతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం వల్ల సమస్య సద్దుమణిగింది. అనంతరం వ్యాపారస్తులు తిరిగి క్రయవిక్రయాలు జరిపారు.
పోలీసుల తీరును నిరసిస్తూ మెదక్లో రాస్తారోకో - Medak police Rude Behaviour
మెదక్ పట్టణంలోని మార్కెట్లో కూరగాయలు అమ్మేందుకు వచ్చిన రైతుపై ఓ పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించాడు. అతనిపై చేయి చేసుకున్నాడు. దీనికి నిరసనగా కూరగాయల వ్యాపారులు రాస్తారోకో చేపట్టారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని మెదక్ పట్టణ సీఐ హామీ ఇవ్వడం వల్ల వివాదం సద్దుమణిగింది.
కూరగాయల వ్యాపారుల రాస్తారోకో