మెదక్ జిల్లా రాజ్పల్లి గ్రామ శివారులో 340 ఎకరాల్లో ఏళ్ల తరబడి పంటలు సాగు చేస్తున్నామని రైతులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి తెలిపారు. ఉన్నపళంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని, తమ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. పరిశ్రమల పేరుతో పంట పొలాలు లాక్కోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
పరిశ్రమల పేరుతో పంట పొలాలు లాక్కోవడం ఏంటి? - మెదక్ జిల్లా వార్తలు
ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్న భూములను పరిశ్రమల పేరుతో లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని మెదక్ జిల్లా రాజ్పల్లి గ్రామ రైతులు ఆవేదన చెందుతున్నారు. భూములు లేకపోతే ఆత్మహత్య తప్ప తమకు వేరే దారిలేదని స్పష్టం చేశారు.

భూములు తీసుకోవద్దంటూ కొందరు మహిళా రైతులు ఎమ్మెల్యే కాళ్ల మీద పడగా.. బీరయ్య అనే రైతు విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమ భూములు లాక్కుంటే చావు తప్ప వేరే దారిలేదని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఏళ్లుగా తమ పొట్ట నింపుతున్న భూములను లాక్కోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. తమ భూములు ఇవ్వడం ఇష్టం లేని వారు వినతి పత్రం సమర్పించాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండిఆ ఊరిలో గుడిసెల్లేవు- కారణం ఆయనే!