తెలంగాణ

telangana

ETV Bharat / state

'వీధి దీపాల నిర్వహణని ప్రైవేట్‌పరం చేయొద్దు'

గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణని ప్రైవేటు సంస్థలకి అప్పగించడాన్ని నిరసిస్తూ మెదక్‌ జిల్లాలోని సర్పంచ్‌లు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు సమావేశమయ్యారు.

medak district sarpanch forum meeting
'వీధి దీపాల నిర్వహణని ప్రైవేట్‌పరం చేయొద్దు'

By

Published : Nov 8, 2020, 1:23 PM IST

గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణని ప్రైవేట్ సంస్థల​కు అప్పగించడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సర్పంచ్‌లు ముక్తకంఠంతో డిమాండ్​ చేశారు. మెదక్​లో జిల్లా సర్పంచ్​ల ఫోరం అధ్యక్షులు మహిపాల్​ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండలాల సర్పంచ్​ల ఫోరం అధ్యక్షులు సమావేశమయ్యారు.

వీధి దీపాల నిర్వహణను ప్రైవేట్​ సంస్థకు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అంగీకరించినట్టు గ్రామ పంచాయతీ తీర్మానాలు అందజేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు అధ్యక్షులు తెలిపారు. ఈ విధానం సరైంది కాదని, దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. దశల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ఇదీ చదవండి:ఆ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details