విధుల్లో నిర్లక్ష్యం వహించిన మెదక్ జిల్లా.. కౌడిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహమ్మద్ అజహరుద్దీన్ నిజామికి జిల్లా కలెక్టర్ యం.హనుమంత రావు మెమో జారీ చేశారు. ప్రకృతి వనాల ఏర్పాటు, ధరణి పోర్టల్, వరి ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో అన్ని మండలాల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీకి నిజామి ఆలస్యంగా రావడమే గాక బాధ్యతారాహిత్యంగా సమావేశం మధ్య నుండే లేచి వెళ్లిపోయాడు. పలుమార్లు ఇదే విధంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. అంతేకాక మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశానికి కూడా గైర్హాజరవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవోకు.. కలెక్టర్ మెమో జారీ - మెమో అందిన రెండు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలి
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కౌడిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారికి మెదక్ జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు మెమో జారీ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్షా సమావేశాలకు గైర్హాజరవ్వడం, కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చి మధ్యలోనే వెళ్లిపోవడం వంటి చర్యలు పాలనాధికారి దృష్టికి వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కలెక్టర్ విధుల్లో ఎంపీడీవో నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవోకు..కలెక్టర్ మెమో జారీ
శుక్రవారం ఎం.పి.డి.ఓ అందుబాటులో లేకపోవడం, అనధికారికంగా గైర్హాజరు కావడం విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ మెమో జారీ చేశారు. మెమో అందిన రెండు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని లేనిచో సి.సి.ఎ. నియమ నిబందనల ప్రకారం చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది: మెదక్ కలెక్టర్
TAGGED:
Memo jari