కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించడంలో ఎదురవుతున్న లారీల కొరతను దృష్టిలో ఉంచుకుని రహదారులపై ఖాళీగా వెళ్తున్న లారీలను వినియోగించుకోవాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి... నార్సింగి మండల కేంద్రంలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ - telangana news updates
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని రైస్ మిల్లులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లారీల కొరతను దృష్టిలో ఉంచుకుని రహదారులపై ఖాళీగా వెళ్తోన్న లారీలను నిలిపి సమీప కొనుగోలు కేంద్రాలకు తరలించేలా చూడాలని అధికారులు, తహసీల్దార్లకు సూచించారు.
medak district collector
హమాలీల, లారీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధాన్యం తూకం వేసి.. మిల్లులకు తరలించి అక్కడ దించుకునే వరకు నిరీక్షంచవల్సి వస్తుందని అన్నారు. కాబట్టి మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని 12 గంటల్లోగా దించుకుని ఏ కేంద్రం నుంచి వచ్చిందో లారీ అదే కేంద్రానికి తిరిగి వెళ్లేలా చూడాలని కోరారు.