రాష్ట్రంలో గతంలో వేసవి వచ్చిందంటే పలు గ్రామాల్లోని ప్రజలు నీటికి ఇబ్బందులు పడేవారని... మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. కానీ నేడు మిషన్ భగీరథ పథకం ద్వారా ఆ సమస్య తీరినా... లీకేజీల వల్ల నీరు వృథా అవుతోందని అన్నారు. దీని కారణంగా భవిష్యత్తులో ముప్పు తప్పదని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వాన నీటి సంరక్షణకు ఉద్దేశించిన జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని... ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టి పొదుపుగా వాడుకోవాలి: కలెక్టర్
ప్రస్తుతం వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని, వాటిని పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని... మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వాన నీటి సంరక్షణకు ఉద్దేశించిన జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని... ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టి పొదుపుగా వాడాలి: కలెక్టర్
పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలను చైతన్య పరిచేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని... కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వాన నీటిని సంరక్షించుకుని భూగర్భ జలాలు పెంపొందించుకునే విధంగా చెక్ డ్యాంలు, కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని అధికారులకు తెలిపారు. ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇది సాధ్యమవుతుందన్నారు. వాన నీటిని సంరక్షించి, పొదుపుగా వాడుకుంటామని అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.