మెదక్ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయాన్ని కరోనా క్వారంటైన్ కేంద్రంగా మార్చారు ఆ పార్టీ నాయకులు. బుధవారం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు చేతులమీదుగా దీనిని ప్రారంభించారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం తెలిపారు.
అక్కడ సీపీఎం కార్యాలయమే కరోనా క్వారంటైన్ కేంద్రం - మెదక్ సీపీఎం కార్యాలయమే కరోనా క్వారంటైన్ కేంద్రం
సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ కార్యాలయాన్ని కరోనా క్వారంటైన్ కేంద్రంగా మార్చినట్లు మెదక్ సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేశం తెలిపారు.
అక్కడ సీపీఎం కార్యాలయమే కరోనా క్వారంటైన్ కేంద్రం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోవడం లేదని మల్లేశం ఆరోపించారు. పేద ప్రజల అవసరార్థమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీపీఎం కార్యాలయాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. నేడు మహానీయుడైన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా క్వారంటైన్ కేంద్రం ప్రారంభించామని మల్లేశం అన్నారు. కరోనా సోకిన పేద ప్రజలు ఈ క్వారంటైన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
TAGGED:
Kevalam kishan