మెదక్ జిల్లా రామాయంపేటలో సన్నవరి ధాన్యానికి క్వింటాలుకు రూ.2500 ధర చెల్లించాలంటూ కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రైతులను సన్నవరి వేయమని చెప్పిన సీఎం మద్దతు ధర ప్రకటించకపోవడం దారుణమన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ఈ నెల 12న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
సన్నవరికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ రాస్తారోకో
సన్నవరికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.మెదక్ జిల్లా రామాయంపేటలోని చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రైతులను సన్నవరి వేయమని చెప్పిన సీఎం కేసీఆర్ క్వింటాలుకు రూ.2500 ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
సన్నవరికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ రాస్తారోకో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ గాలి అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి సీఎంను విమర్శించారు. రామాయంపేటలోని చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, రైతులు ధర్నాకు దిగారు. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.