ప్రజా సంక్షేమం కోసం సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ రాజకీయాలకు అతీతంగ పనిచేస్తానని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠ తిరుపతి రెడ్డి అన్నారు. ఆదివారం
మెదక్ పట్టణంలో సిటీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరం(Blood donation)ను… ఆయన ప్రారంభించారు.
తలసేమియా రోగుల కోసం యువత రక్తదానం చేయడం హర్షించ దగిన విషయమని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. యువతను ప్రోత్సహించడనికి తానూ ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలు, నిర్వాహకులు పృథ్వి, వంశీ, హరికృష్ణ, మనోజ్, జుల్ఫాకర్, సోనూ, యాదుల్, కిరణ్, డాక్టర్లు, సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.