మెదక్ జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలు, కూరగాయల మార్కెట్లో జిల్లా అధికారులు తనిఖీలు చేశారు. కొవిడ్ సాకు చూపించి నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్ర కమిటీ సభ్యులైన జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్, జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, జిల్లా ఉద్యాన అధికారి మౌనిక, వ్యవసాయాధికారి ప్రవీణ్‌తో కలిసి దుకాణాల్లో సోదాలు చేశారు.
'నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు' - మెదక్‌లో నిత్యావసర సరుకుల దుకాణాల్లో తనిఖీలు
లాక్డౌన్, కొవిడ్ సాకు చూపి నిత్యావసర సరుకులు నిల్వ ఉంచినా.. అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. నిత్యావసర సరకుల లభ్యతపై జిల్లా అధికారులతో కలిసి నగరంలోని పలు దుకాణాలు, మార్కెట్లను తనిఖీ చేశారు.
మెదక్ వార్తలు
లాక్‌డౌన్‌కు ముందు ఉన్న ధరలకు... ఇప్పటి ధరలకు గల వ్యత్యాసాన్ని పరిశీలించడమే కాకుండా వినియోగదారులకు సరుకుల లభ్యతను పరిశీలించారు. పలు సూపర్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఎవరైనా అధిక ధరలకు సరుకులను విక్రయిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.