తెలంగాణ

telangana

ETV Bharat / state

వందేళ్ల తర్వాత వచ్చిన పెద్ద విపత్తు కరోనా: కలెక్టర్

మెదక్ కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంఛార్జీ కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. కరోనా సమయంలో అమూల్యమైన సేవలందించిన వైద్య సిబ్బందికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు. కరోనా అంటే తెలియని రోజుల్లో వైద్యం అందించామని... ఇప్పుడు మెరుగైన సేవలందించాలని ఆయన సూచించారు.

medak collector venkatarami reddy review about corona with health department
వందేళ్ల తర్వాత వచ్చిన పెద్ద విపత్తు కరోనా: కలెక్టర్

By

Published : Jan 2, 2021, 5:41 PM IST

కరోనా సమయంలో వైద్య సిబ్బంది ఫ్రంట్ లైన్‌లో ఉండి ప్రజలకు సేవలందించడంలో కృషి చేసి మరణాలను నివారించగలిగారని మెదక్ ఇంఛార్జీ కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి అన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున వారికి ధన్యవాదాలు తెలిపారు. అదే స్పూర్తితో త్వరలో రాబోయే కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రాధాన్యత క్రమంలో ఇచ్చుటకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సుమారు వందేళ్ల తర్వాత కరోనా వంటి పెద్ద విపత్తు వచ్చిందని, ఇది సమాజంపై ఎంతో ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఇటువంటి విపత్తులను ధైర్యంగా ఎదుర్కొనడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని అన్నారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

వందేళ్ల తర్వాత వచ్చిన పెద్ద విపత్తు కరోనా: కలెక్టర్

కార్యాచరణ అవసరం

ఒక వ్యాక్సిన్‌ను తయారుచేసి, అందుబాటులో తీసుకురావడానికి సుమారు నాలుగైదు ఏళ్లు పడుతుందని... కాని మనం ప్రపంచ స్థాయి సంస్థల సహకారంతో కేవలం తొమ్మిది మాసాల్లో అత్యంత నమ్మకమైన వ్యాక్సిన్‌ను తయారు చేసి, అందించే స్థాయికి వచ్చామని అన్నారు. ఈ వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ ప్రక్రియకు ముందే జిల్లా వైద్య, అర్బన్ కేంద్రాలు, ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేసుకుంటూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులను గుర్తించి కార్యాచరణ ముందే సిద్దం చేసుకోవాలని సూచించారు.

మెరుగైన సేవలు

తొలి దశలో 4,073 ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి, రెండో దశలో పోలిస్ సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి, అంగన్వాడి సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. మూడో దశలో 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు, బి.పి, షుగర్, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిందని... వైద్యాధికారులు తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కరోనా అంటే తెలియని రోజుల్లో వైద్యం అందించామని, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చినందున అంతకన్నా మెరుగైన సేవలు అందించాలని కోరారు.

పల్స్ పోలియోపై సమీక్ష

పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ఈ నెల 17న జిల్లాలో ఏర్పాటు చేసిన 598 కేంద్రాల్లో 1,196 బృందాల ద్వారా పోలియో చుక్కలను వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 18, 19 తేదీల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు, సుమిత్రా రాణి, ఎస్‌ఎంవో మురళి రాజేంద్ర ప్రసాద్, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ అదనపు వైద్యారోగ్య శాఖాధికారులు విజయ నిర్మల, అరుణ శ్రీ, డెమో పాండురంగా రావు, పీహెచ్‌సీ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దా'రుణ' యాప్‌ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details