మెదక్ జిల్లా వ్యాప్తంగా 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమానికి ఆసక్తి గల ఆవిష్కర్తలు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమంలోని ఆవిష్కరణలను స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలంగాణ జిల్లాల్లో ఆన్లైన్లో ప్రదర్శించడం జరుగుతుందని వివరించారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటిలో, వ్యక్తిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ఇంటింటా ఇన్నోవేషన్‌లో సాధారణ గృహిణి మొదలుకొని అన్ని రంగాలకు చెందిన వారు పాల్గొనడానికి అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆసక్తి గల వారి వివరాలను 9100678543 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఈనెల 31వ తేదీ వరకు పంపించాలని కలెక్టర్ ధర్మారెడ్డి వివరించారు.
'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమానికి దరఖాస్తులకు అవకాశం
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆసక్తి గల ఆవిష్కర్తలు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి వెల్లడించారు. ఇంటింటా ఇన్నోవేషన్‌లో సాధారణ గృహిణి మొదలుకొని అన్నిరంగాల చెందిన వారు పాల్గొనడానికి అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జిల్లాలోని ఆయా ఆస్పత్రుల వైద్యుల, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి... జిల్లాలో మాతృ మరణాల సంఖ్య తగ్గేాల చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం మెదక్ జిల్లాలోని ఆయా ఆస్పత్రుల డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మాతృ మరణాల సంఖ్య తగ్గేలా చూడాల్సి బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై ఉందని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా గర్భిణుల, మాతా, శిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దీనికి అనుగుణంగా గ్రామాల్లోని పీహెచ్సీలలో పని చేసే ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, గర్భిణులు, బాలింతలకు అవసరమైన సలహాలు, సూచనలు అందచేయడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు, ఈవోఎంహెచ్ఎన్ సుమిత్రారాణి, అదనపు జిల్లా వైద్యాధికారి రాజు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'డాక్టర్ పట్టించుకోవట్లేదు.. ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది'