తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు పంట మార్పిడి అవగాహన కల్పించాలి: కలెక్టర్​ ధర్మారెడ్డి - agriculture department latest news

రైతులకు లాభం చేకూరేలా పంట మార్పిడి విధానం అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఏఈవోలు ఇంటింటికీ వెళ్లి రైతులకు పంట సేద్యంపై పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు.

medak district latest news
medak district latest news

By

Published : May 20, 2020, 10:33 AM IST

పంటలు సాగు చేసే ప్రతి రైతుకు లాభం చేకూరేలా పంట మార్పిడి విధానం అమలు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, అనుబంధ శాఖల అధికారులు, రైస్​ మిల్లర్స్​ ప్రతినిధులు, సీడ్ డీలర్ల అసోసియేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వర్షాకాలంలో రైతులకు పంట మార్పిడి, వరి, పత్తి, కంది పంటల సాగు చేసే విధానంపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు మెదక్ జిల్లాలో వరి పంటను నియంత్రిత పద్ధతిలోసాగు చేయడానికి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే మొక్కజొన్న పంటను కమర్షియల్ పద్ధతిలో సాగు చేయకూడదని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా కంది పంటను సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు.

ప్రతి కంది గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... అలాగే సర్కారే తెలంగాణ సోనా, సన్నరకాలు సరఫరా చేస్తుందని కలెక్టర్ వివరించారు. దీంతో పాటు ఉద్యాన పంటల సాగుకు ప్రణాళిక రూపొందించాలని ఉద్యానవనశాఖ అధికారికి సూచించారు. వరి విత్తనాలకు డిమాండ్ ఉందని... అయితే ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయరాదన్నారు. అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్మకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులకు పాలనాధికారి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ జిల్లాలోని విత్తన డీలర్లు వరి విత్తనాలను ప్రభుత్వం చెప్పేంత వరకు రైతులకు అమ్మకూడదన్నారు.

మెదక్ జిల్లాలో ఏ పంట ఎంత వేయాలి... ? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలనే అంశాలపై అధికారులు ఖరారు చేయనున్నారని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాల వారీగా పంటల మ్యాప్లను అధికారులు రూపొందించాల్సినవసరం ఉందన్నారు. క్రాప్ కార్డు వచ్చిన తర్వాత జిల్లాలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేయాలనేది నిర్ణయించాలని పేర్కొన్నారు.

రైతుల వారీగా భూముల వివరాలు, వేస్తున్న పంటల వివరాలను నివేదిక రూపొందించాలన్నారు. క్లస్టర్ వారీగా రైతు వేదికలకు భూమిని గుర్తించి త్వరితగతిన నిర్మాణం చేపట్టడానికి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details