మంగళవారం మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్... బ్యాంకులు రుణాల మంజూరులో అర్హులైన లబ్ధిదారులందరికీ చేయూతనివ్వాల్సిన అవసరంఎంతైనా ఉందని తెలిపారు. వీటితో పాటు పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం వల్ల చాలా మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం అందచేస్తున్న రుణాల గురించి వారికి అవగాహన కూడా కల్పించాలని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని రైతులకు సంబంధించిన వ్యవసాయ రుణాలను రెన్యూవల్ చేయడంలో వేగం పెంచాలని చెప్పారు.
లబ్ధిదారులకు బ్యాంకులు చేయూతనివ్వాలి: కలెక్టర్ ధర్మారెడ్డి - మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. రుణాల ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు బ్యాంకులు ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు.
లబ్ధిదారులకు బ్యాంకులు చేయూతనివ్వాలి: కలెక్టర్ ధర్మారెడ్డి
TAGGED:
కలెక్టర్ ధర్మారెడ్డి