ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులలో సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిన 20 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ ఈనెల 31న సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆడిటోరియంలో ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఓ ప్రకటనలో తెలిపారు.
కాంట్రాక్ట్ పద్ధతిన 20 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ - medak collectorate latest updates
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులలో సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిన 20 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రకటనలో తెలిపారు.
కాంట్రాక్ట్ పద్ధతిన 20 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్, టీఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల, ధ్రువీకరణ పత్రం ఎస్ఎస్ సీ, ఎంబీబీఎస్ ధ్రువీకరణ పత్రాలతో పాటు 2 పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రతి నెల వేతనంగా రూ. 40,270, ఇన్సెంటివ్ లభిస్తాయని తెలిపారు. తదుపరి అవసరం మేరకు కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉందన్నారు.