మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, నీటిపారుదల, రెవెన్యూ పంచాయతీరాజ్‌శాఖల నియోజకవర్గ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులకు సకాలంలో పూర్తి చేయాలని అధికారులతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు.
'పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తిచేయండి' - వివిధ శాఖల అధికారులతో మెదక్ కలెక్టర్ సమీక్ష
మెదక్ జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
'పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తిచేయండి'
ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులంతా సాగుచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలా సాగుచేస్తేనే పథకాలు వస్తాయని చెప్పాలన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు.
ఇదీ చూడండి :ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?