రాగల మూడు రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నందున వర్షానికి ధాన్యం కొట్టుకుపోకుండా, పాడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మెదక్ కలెక్టర్ హరీష్.. అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందించడంతోపాటు, అవసరమైతే సమీప రైతు వేదికల్లో ధాన్యాన్ని భద్రపరచవలసిందిగా ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనుమతి ఇచ్చారని తెలిపారు.
'అవసరమైతే ధాన్యాన్ని రైతు వేదికల్లో భద్రపరచండి' - తెలంగాణ వార్తలు
రానున్న మూడురోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అప్రమత్తమయ్యారు. వానలకు వరి ధాన్యం పాడవకుండా అధికారులకు పలు సూచనలు చేశారు.
ధాన్యం భద్రతపై అధికారులకు మెదక్ కలెక్టర్ ఆదేశాలు