తెలంగాణ

telangana

ETV Bharat / state

రైస్​మిల్​ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​ - కలెక్టర్ హరీశ్​ తాజా వార్తలు

మెదక్ జిల్లా ధర్మారంలోని ఓ రైస్​మిల్​ను కలెక్టర్ హరీశ్​, జాయింట్ కలెక్టర్ రమేశ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా, హమాలీల కొరత వల్ల ధాన్యం కొనుగోళ్లకు అడ్డంకులు ఏర్పడ్డాయని కలెక్టర్​ తెలిపారు. పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

medak collector harish, ricemill inspection in dharmaram
medak collector harish, ricemill inspection in dharmaram

By

Published : May 13, 2021, 5:45 PM IST

ఇప్పటివరకు ఒక లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్​ హరీశ్ తెలిపారు. ఒక్కసారిగా కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా ధాన్యం రావడం వల్ల అన్​లైన్లో చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారంలో మహేశ్వరి బిన్నీ పార్​బాయిల్డ్ రైస్​మిల్​ను జాయింట్ కలెక్టర్ రమేశ్​తో పాటు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నాలుగు రోజుల నుంచి ఆకస్మికంగా మిల్లులను తనిఖీ చేస్తున్నట్లు కలెక్టర్​ తెలిపారు. హమాలీలను ఎక్కువగా పెట్టుకోవాలని.. వేగంగా ధాన్యాన్ని తరలించాలని నిర్వాహకులను అదేశించామన్నారు.

కరోనా, హమాలీల కొరత వల్ల కాస్త ఇబ్బంది ఏర్పడిందని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని, రంజాన్ పండుగ సెలవులు ఏమి లేవని జాయింట్ కలెక్టర్ రమేశ్​ అన్నారు.

ఇదీ చూడండి: 'కరోనాకు జీవించే స్వేచ్ఛ ఉంది కదా?'

ABOUT THE AUTHOR

...view details