నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నామని మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పట్టణంలో.. 3 నెలల్లో చేపట్టబోయే అభివృద్ధిపై ప్రణాళికను తయారు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. దేవాలయ భూముల్లో అక్రమాలకు పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ మాలతీని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిశీలించారు.