మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చెరువుల పరిరక్షణపై రెవిన్యూ, నీటి పారుదల శాఖ అధికారులతో కలెక్టర్ ఎస్. హరీశ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాధాన్యత గల చెరువులకు సరిహద్దులు గుర్తించి... అవసరమైన సర్వే చేసి, ప్రాథమిక దశలో నోటిఫికేషన్ ఇచ్చి అట్టి వివరాలను హెచ్ఎండీఏ వెబ్ సైట్లో పొందుపరచాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో 589 చెరువులకు గాను 526 చెరువుల సర్వే పనులు పూర్తి చేసి 156 చెరువులకు సంబంధించి ప్రాథమికంగా నోటిఫైడ్ చేశామని కలెక్టర్ హరీష్ అన్నారు. మిగతా 63 చెరువుల సర్వేతో పాటు 370 చెరువుల ప్రిలిమినరీ నోటిఫికేషన్‌కు తగు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు సూచించారు. తహసీల్దార్లు ప్రాథమిక దశలో నోటిఫై చేసి.. ఆ వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని తెలిపారు. అభ్యంతరాలు రాకపోతే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు.