మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతువేదిక నిర్మాణ పనులను కలెక్టర్ యం.హనుమంతరావు పరిశీలించారు. నిర్మాణాల్లో ఏమాత్రం నాణ్యత లోపాలు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. రైతు వేదిక నిర్మాణ పనుల విషయమై సంబంధిత కాంట్రాక్టర్ను అడిగి వివరాలను తెలుసుకొన్నారు.
నాణ్యత లోపాలు ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్ హనుమంతరావు
రైతువేదికల నిర్మాణాల్లో ఏమాత్రం నాణ్యత లోపాలు ఉన్నా చర్యలు తప్పవని మెదక్ జిల్లా కలెక్టర్ యం.హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు.
నాణ్యత లోపాలు ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్ హనుమంతరావు
అధికారులు నిత్యం గ్రామాల్లో పనులను పర్యవేక్షిస్తున్నప్పటికీ... ఆశించినంత మేర జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:దంత వైద్యుడి అపహరణ కేసులో ఏడుగురు అరెస్ట్