తెలంగాణ

telangana

By

Published : Oct 28, 2020, 12:49 PM IST

ETV Bharat / state

యుద్ధప్రాతిపదికన రైతు వేదికలను పూర్తి చేయాలి: కలెక్టర్

మెదక్​ జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్​ హనుమంతరావు సమీక్ష నిర్వహించారు. మండలాల వారిగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వివిధ అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన రైతు వేదికలను పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

medak collector hanumantha rao review on raithu vedika and palle prakruthi vanam
యుద్ధప్రాతిపదికన రైతు వేదికలను పూర్తి చేయాలి: కలెక్టర్

మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ యం.హనుమంతరావు ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన రైతు వేదికలను పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోని ఆయా మండలాల అధికారులు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయధికారులు, విస్తరణాధికారులతో కలెక్టరేట్​లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు చాలా వరకు పూర్తి కాలేదని... ఇది బాధాకరమని ఆయన అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

అభివృద్ధి పనులపై ఆరా

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయనే వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని... కాంట్రాక్టర్లు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల పనులు వంద శాతం పూర్తి చేయాలన్నారు. మొక్కలు పెంచాలని, నర్సరీలను ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఎంపీడీవోలు పూర్తి బాధ్యత వహించాలన్నారు.

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, పీఆర్ఈఈ రాంచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, డీఏవో పరశురామ్ నాయక్, మెదక్, తూప్రాన్ ఆర్డీవోలు సాయిరామ్, శ్యామ్ ప్రకాశ్, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు దేవయ్య, జయరాజ్, శ్రీనివాసులు, యేసయ్య, గంగయ్య, రసూల్బీ, ఆయా శాఖల డీఈలు, ఆయా మండలాల ఏఈలు, ఎంపీడీవోలు, ఏవోలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మేమూ నేరుగా పంటల్ని కొంటాం: మార్కెటింగ్​శాఖ

ABOUT THE AUTHOR

...view details