రైతుల నుంచి చివరి గింజ వరకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని మెదక్ జిల్లా పాలనాధికారి ఎం.హనుమంతరావు వెల్లడించారు. జిల్లాలో రైతన్నలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వీలైనంత వరకు ధాన్యం కళ్లాల్లో ఆరబెట్టి... తేమశాతం తగ్గాకే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. అకాల వర్షాల నుంచి రక్షణకు టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవాలని రైతులకు తెలియజేశారు.
తేమశాతం తగ్గాకే ధాన్యాన్ని తీసుకురావాలి : కలెక్టర్ - మెదక్ జిల్లా తాజా వార్తలు
చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని... రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెదక్ జిల్లా పాలనాధికారి ఎం.హనుమంతరావు స్పష్టం చేశారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తేమశాతం పూర్తిగా తగ్గాకే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.
![తేమశాతం తగ్గాకే ధాన్యాన్ని తీసుకురావాలి : కలెక్టర్ Medak collector give instructions to farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9444439-861-9444439-1604585634305.jpg)
తేమశాతం తగ్గాకే ధాన్యాన్ని తీసుకురావాలి : కలెక్టర్
జిల్లాలో 76 రైతు వేదికలను నిర్మించాల్సి ఉండగా 16 పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు యంత్రాంగ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.