మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ రహదారి వెంట సొంత రాష్ట్రాలకు తరలిపోతున్న వలస కార్మికులకు ఆహారం ప్యాకెట్లతో పాటు పాదరక్షలు అందజేశారు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎమ్మార్వో విజయలక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వలస కార్మికులకు ఆహారం, పాదరక్షల పంపిణీ - వలస కార్మికులకు ఆహారం, పాదరక్షల పంపిణీ
ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి లాక్డౌన్ సమయంలో కాలినడకను ఇళ్లకు బయలుదేరిన వలస కార్మికులకు మెదక్ జిల్లా కలెక్టర్ ఆహారం ప్యాకెట్లను, పాదరక్షలను అందజేశారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకూ ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని సూచించారు.
వలస కార్మికులకు ఆహారం, పాదరక్షల పంపిణీ
లాక్డౌన్ కారణంగా వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్న వారి ఆకలి తీర్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. లాక్‌డౌ పూర్తయ్యేవరకు ఎవరూ ఇంట్లోంచి బయటకు రాకూడదని తెలిపారు. అత్యవసర సమయాల్లో బయటకు వచ్చినవారు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు.