'మొక్కల సంరక్షణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి' - medak collector dharmareddy
గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్, ఉపాధిహామీ సిబ్బందికి మెదక్ జిల్లా కలెక్టర్ సూచించారు.
'మొక్కల సంరక్షణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి'
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. మొక్కల సంరక్షణలో సర్పంచి, ఉపాధిహామీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.