మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లాలో డీఎల్పీఓ, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలతో టెలీకాన్ఫరెన్ నిర్వహించారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో శ్మశానవాటికలు, రైతువేదికలు, రైతు కల్లాలు, డంపుయార్డుల నిర్మాణాలు ఏఏ స్థాయిలో ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పనుల విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'అభివృద్ధిలో మెదక్ ఎప్పుడూ ముందే ఉండాలి' - 'అభివృద్ధిలో ఎప్పుడూ మెదక్యే ముందుండాలి'
మెదక్ జిల్లా అన్ని విషయాల్లో అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యమని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. అందులో భాగంగానే గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎక్కడి వరకు వచ్చాయో తెలుసుకునేందుకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
'అభివృద్ధిలో ఎప్పుడూ మెదక్యే ముందుండాలి'
పనులు వేగంగా పూర్తి చేయడమే కాకుండా వాటిలో నాణ్యత లోపించకుండా చూసే బాధ్యత కూడా అధికారులదేనని కలెక్టర్ తెలిపారు. ఈ వర్షాకాలంలో దోమలు ఎక్కువగా వచ్చి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని కోరారు. అన్ని విషయాల్లోనూ మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..