ఐదో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం సిబ్బందికి శిక్షణనిస్తోంది. శిక్షణా తరగతులను హాజరైన కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచనలు చేశారు. ఎన్ని మొక్కలు నాటామనే దానికన్నా.. ఎన్నింటిని సంరక్షించామనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి సమన్వయం ఉంటేనే హరితహారం కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి అందరిని భాగస్వామ్యం చేయాలని ధర్మారెడ్డి సూచించారు.
ఎన్ని నాటామనేది కాదు.. ఎన్నింటిని సంరక్షించామనేదే ముఖ్యం - medak
హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మెదక్ జిల్లాలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ తరగతులు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచనలు చేశారు.
ఎన్ని నాటామనేది కాదు.. ఎన్నింటిని సంరక్షించామనేదే ముఖ్యం