ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో ఉదయం నాలుగు గంటల నుంచి ఈస్టర్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున కొవ్వొత్తులు వెలిగించి క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. ఏసు పునరుత్థానము గుర్తు చేసుకుంటూ పాటలు పాడారు. ఈస్టర్ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటం వల్ల చర్చి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చారు.
మెదక్ చర్చిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు
మెదక్ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు చేశారు.
మెదక్ చర్చిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు