ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆన్లైన్ విద్యాబోధనకు కేబుల్ ఆపరేటర్లు తప్పకుండా సహకరించాలని... ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లాలోని ఆయా మండలాల కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు.
కొవిడ్–19 నేపథ్యంలో మూడో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి, టీ–శాట్ ఛానెళ్లలో బోధించనున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లందరూ దూరదర్శన్ యాదగిరి, టీ–శాట్ ఛానెళ్ల ను తప్పని సరిగా ప్రసారం చేయాలని అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆదేశించారు.