మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రజలంతా మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని, కొవిడ్ నిబంధనలు పాటించి పూజలు చేసుకోవాలని, మండపాల వద్ద, పూజా కార్యక్రమాల వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్టించుకోవాలని కోరారు. సామూహిక పూజలు, ప్రార్థనలు, ఊరేగింపుల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.
మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన అదనపు కలెక్టర్! - మెదక్ అదనపు కలెక్టర్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా కృషి చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా అందరు పండుగ నిర్వహించుకోవాలని లేదంటే వైరస్ విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.
నిమజ్జనానికి ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేసే పరిస్థితులు లేవని.. రాబోయే రోజుల్లో వినాయక చవితితో పాటు అన్ని పండగలను వైభవంగా నిర్వహించుకోవచ్చని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ సూచనలు పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ ఛైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు బట్టి లలిత, శ్రీనివాస్, ఆంజనేయులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు