తెలంగాణ

telangana

ETV Bharat / state

జమున కోళ్ల ఫారాల వద్ద 'ప్రభుత్వ భూమి' బోర్డులు - మంత్రి ఈటల రాజేందర్​పై భూకబ్జా ఆరోపణలు

భూకబ్జాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్​కు సంబంధించిన జమున కోళ్ల ఫారాల వద్ద అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ సర్వేయర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు మాసాయిపేట తహసీల్దార్ ఆ స్థలంలో 'ప్రభుత్వ భూమి' బోర్డులు ఏర్పాటు చేయించారు.

masaipet-boards-at-jamuna-chicken-farms
జమున కోళ్ల ఫారాల వద్ద మాసాయిపేట బోర్డులు

By

Published : May 2, 2021, 12:57 PM IST

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేటల్లో ఈటల రాజేందర్​కు చెందిన జమున కోళ్ల ఫారాల వద్ద అసైన్డ్ భూములను రెవెన్యూ సర్వేయర్లు గుర్తించారు. ఆ స్థలంలో మాసాయిపేట తహసీల్దార్ 'ప్రభుత్వ భూమి' బోర్డు ఏర్పాటు చేసింది. భూకబ్జాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయనను ఆరోగ్య మంత్రిగా తప్పించారు.

మంత్రి ఈటల రాజేందర్​పై మెదక్ జిల్లాకు చెందిన కొందరు రైతులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. లేఖపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై నిగ్గుతేల్చాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే వివాదానికి కేంద్రంగా నిలిచిన మాసాయిపేట, హకీంపేట అసైన్డ్ భూముల్లో అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. మంత్రి ఈటలకు చెందిన హేచరీస్ సహా అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే చేశారు. విచారణను పర్యవేక్షించిన... మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్.. ప్రాథమికంగా అసైన్డ్ భూముల కబ్జా జరిగినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం?

ABOUT THE AUTHOR

...view details