తెలంగాణ

telangana

ETV Bharat / state

'దొంగతనం చేశాడని కొట్టి చంపారు' - man killed

ఓ వ్యక్తిని దొంగతనం చేశాడని కొట్టి చంపిన ఘటన మెదక్ జిల్లా కాళ్లకల్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

నాగరాజు భార్యపిల్లలు

By

Published : Sep 14, 2019, 5:47 PM IST


మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్​లో సైకిల్ దొంగతనం చేశాడని నాగరాజు అనే వ్యక్తిని స్థానికులు తీవ్రంగా కొట్టి.. పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. అస్వస్థతకు గురైన నాగరాజు ఇంటికి వచ్చి అలాగే పడుకొన్నాడు. ఉదయం భార్య నిద్ర లేపగా అప్పటికే మృతి చెందాడు. సమాచారమందుకున్న తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కొట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా లింగపేట మండలం ఐలాపూర్. బతుకు దెరువు కోసం కాళ్లకల్ వచ్చి జీవిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

'దొంగతనం చేశాడని కొట్టి చంపారు'

ABOUT THE AUTHOR

...view details