తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం - chegunta

మెదక్‌ జిల్లా రెడ్డిపల్లిలో రోడ్డు దాటేందుకు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

By

Published : Aug 18, 2019, 11:18 PM IST

మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్రేపల్లి లాలం అనే రైతు సైకిల్‌పై చేగుంటకు వెళ్లే క్రమంలో... బైపాస్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లాలం కాళ్లు, చేతులు విరిగి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇప్పటి వరకు ఇదే ప్రాతంలో 61 మంది మృతి చెందినట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి ధర్నా నిర్వహించారు. ఫ్లైఓవర్‌ నిర్మించాలని డిమాండ్ చేశారు. రాస్తోరోకోతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనస్థలానికి చేరుకొని పోలీసులు ఆందోళన విరమింపజేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details