మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామ శివారులోని పత్తి పంటపై మిడతల దండు దాడి కలకలం సృష్టిస్తోంది. బహిరన్ దిబ్బ గ్రామానికి చెందిన రైతు బాలయ్య తనకున్న రెండెకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాడు. రోజూలాగే చేనుకు వెళ్లిన రైతు పంటపై మిడతల గుంపు వాలి ఉండటాన్ని గమనించాడు.
పత్తి పంటపై మిడతల దండు దాడి - farmers problems
పత్తి పంటపై మిడతల దండు దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. రెండు ఎకరాల్లో వేసిన పత్తి పంటపై మిడతల గుంపు వాలి ఉండటాన్ని సదరు రైతు గమనించి వ్యవసాయ అధికారులకు తెలిపాడు.

Locust attack on cotton crop in medak
ఈ విషయాన్ని వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేశాడు. పంటను పరిశీలించిన అధికారులు వాటిని చంపేందుకు విఫలయత్నం చేశారు. మిడతల దండు దాడి చేయటం వల్ల తాను తీవ్రంగా నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.