ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. హుస్నాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మర్రిచెట్టుపై పిడుగు... చెలరేగిన మంటలు - తెలంగాణలో వర్షాలు
మంగళవారం అర్థరాత్రి రాష్ట్రంలోని పలుచోట్ల ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మెదక్‌లో మర్రిచెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
మర్రిచెట్టుపై పిడుగు... చెలరేగిన మంటలు
ఆందోల్ మండలం ఎర్రారం వద్ద నాందేడ్ జాతీయ రహదారి పక్కన ఉన్న భారీ మర్రి చెట్టుపై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగాయి. వాహనదారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా... వారు ఘటనస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇదీ చూడండి:అకాలవర్షం.. చేతికందిన ధాన్యం నీటి పాలు