తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని ఏడు మండలాల్లో లోటు వర్షపాతమే! - less rainfall registered in joint medak district

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వరుణుడు ముందే కరుణించాడు. ఉమ్మడి మెదక్​ జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివెత్తుతోంది. సిద్దిపేట జిల్లాలోని 23 మండలాల్లోనూ సాధారణానికి మించి వానలు పడ్డాయి. ఇదే తీరుగా వానలు కురిస్తే తమ పంటలు పండుతాయని రైతులు ఆశగా ఉన్నారు. తొలకరి మురిపించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని ఏడు మండలాల్లో మాత్రం లోటు వర్షపాతమే నమోదవుతోంది.

less rainfall registered in joint medak district
సంగారెడ్డి, మెదక్‌లలో ఏడు మండలాల్లోనే లోటు వర్షపాతం

By

Published : Jul 2, 2020, 9:03 AM IST

గతేడాదితో పోల్చితే ఈసారి వానాకాలం ప్రారంభం ఉమ్మడి జిల్లా రైతులకు అనందాన్నే మిగుల్చుతోంది. కొన్ని మండలాలు మినహా అత్యధిక చోట్ల సమృద్ధిగా వర్షాలు పడటమే ఇందుకు కారణం. సిద్దిపేట జిల్లాలోని 23 మండలాల్లోనూ సాధారణానికి మించి వానలు పడ్డాయి. ఇందుకు భిన్నంగా మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏడు మండలాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులున్నాయి. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయింది.

ఈ వానాకాలం ప్రారంభం నుంచి జులై 1వ తేదీ వరకు యంత్రాంగం అందించిన గణాంకాలను పరిశీలిస్తే ఈసారి వరుణుడి కరుణ ఉమ్మడి జిల్లాపై ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే తీరుగా వానలు కురిస్తే తమ పంటలు పండుతాయని రైతులు ఆశగా ఉన్నారు. తొలకరి మురిపించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో జలాశయాల ద్వారా సాగునీరందించే పనులు వేగిరమయ్యాయి. చెరువులు నింపుతున్నారు. త్వరలోనే మెదక్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకూ గోదావరి నీళ్లను రప్పించేలా పనులు నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే వానలూ సమృద్ధిగా కురుస్తుండటంతో రానున్న రోజుల్లో ఆ మేరకు దిగుబడులూ పెరిగేందుకు ఆస్కారముంది.

సిద్దిపేట జిల్లాలో 23 మండలాలున్నాయి. ఈ వానాకాలంలో ఇప్పటి వరకున్న గణాంకాలను పరిశీలిస్తే ఈ జిల్లాలో సమృద్ధిగా వానలు పడ్డట్లు స్పష్టమవుతోంది. అన్ని చోట్లా సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయింది. సిద్దిపేట అర్బన్‌(217), కొండపాక(207), జగదేవ్‌పూర్‌ (205) మండలాల్లో కురవాల్సిన దానికంటే అధికంగా 200ల శాతానికిపైగా వర్షం పడటం విశేషం.

సంగారెడ్డి, మెదక్‌లలో ఏడు మండలాల్లోనే లోటు వర్షపాతంసంగారెడ్డి, మెదక్‌లలో ఏడు మండలాల్లోనే లోటు వర్షపాతం

అయిదు చోట్ల ఇప్పటికీ లోటే..

సంగారెడ్డి జిల్లాలో 26 మండలాలున్నాయి. జిల్లా సగటు పరిశీలిస్తే కురవాల్సిన దానికంటే అధికంగానే వానలు పడ్డాయి. 27.5శాతం ఎక్కువగా వర్షపాతం నమోదయింది. కానీ అయిదు మండలాల్లో ఇప్పటికీ లోటే కనిపిస్తోంది. అదే సమయంలో సిర్గాపూర్‌(166), ఝరాసంగం(150), కోహిర్‌(119) మండలాల్లో ఈ సీజన్‌లో పడాల్సిన వర్షాలకంటే 100శాతానికిపైగా కురవడం విశేషం. మొత్తంగా చూస్తే 11 మండలాల్లో అత్యధిక వానలు పడగా.. 10చోట్ల సాధారణ వర్షపాతం నమోదయింది.

సంగారెడ్డి, మెదక్‌లలో ఏడు మండలాల్లోనే లోటు వర్షపాతం

సగం చోట్ల అత్యధిక వర్షపాతం

మెదక్‌ జిల్లాలో 20 మండలాలున్నాయి. ఇందులో పది మండలాల్లో సాధారణాన్ని మించి వానలు పడ్డాయి. ఎనిమిది చోట్ల సాధారణ వర్షపాతం నమోదయింది. కేవలం రెండు మండలాల్లో మాత్రమే లోటు కనిపిస్తోంది. రామాయంపేట (114), చేగుంట (96), వెల్దుర్తి (93) మండలాల్లో కురవాల్సిన దానికంటే 90శాతం మేర అధికంగా వానలు పడ్డాయి.

సంగారెడ్డి, మెదక్‌లలో ఏడు మండలాల్లోనే లోటు వర్షపాతం

ABOUT THE AUTHOR

...view details