తెలంగాణ

telangana

By

Published : Jun 6, 2021, 5:03 PM IST

ETV Bharat / state

Harish Rao: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్​ రావు

మెదక్ పట్టణంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. రోనా పరీక్షలను వేగవంతం చేయడం కోసం జిల్లాలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్​ను ఈ రోజు ప్రారంభించామని… రేపటి నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లా ప్రజలు దానిని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.

harish rao
harish rao: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన నేతలు

70 ఏళ్ల పరిపాలనలో మంజీరా మీద ఒక్క చెక్ డ్యామ్ ఇవ్వని ఘనత కాంగ్రెస్, తెలుగుదేశం పాలకులదని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. ఆదివారం మెదక్ పట్టణంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్​, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాశ్​ రెడ్డి పాల్గొన్నారు.

మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్, రెవెన్యూలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ గత ఆర్థిక సంవత్సరం మార్చిలో మెదక్ రైల్వేలైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారని హరీశ్​రావు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 25 కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే… నాలుగైదు నెలల్లో రైల్వే లైన్​ పూర్తి చేసి ప్రారంభిస్తామని రైల్వే చీఫ్ ఇంజినీర్ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఆర్​అండ్​బీ అధికారులతో మాట్లాడి 40 కోట్లకు అదనంగా… 25 కోట్లను వెంటనే విడుదల చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.

ఘనపూర్ ఆనకట్ట, హల్ది ప్రాజెక్టుపై సమావేశం జరిపారు. ఘనపూర్ ఆనకట్టకు సంబంధించి ఎత్తు పెంచే విషయంలో గతంలో ఐదు కోట్ల రూపాయలను విడుదల చేశామని చెప్పారు. అధిక నీరు నిల్వ ఉంచేందుకు భూ సేకరణ కోసం ఎనిమిది కోట్ల రూపాయలు త్వరగా విడుదల చేయాలని కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పాలకులు హల్ది ప్రాజెక్టును పట్టించుకోలేని మంత్రి అన్నారు. హల్దీ ప్రాజెక్టు ఆధునికీకరణ, కాలువలు, సిమెంట్ లైనింగ్ కోసం 25 కోట్ల రూపాయల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కల్కి ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఐదు చెక్​డ్యాంలు మంజూరయ్యాయని.. అందులో నాలుగు పూర్తయ్యాయన్నారు. ఇంకో చెక్ డ్యాంను త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

కరోనా పరీక్షలను వేగవంతం చేయడం కోసం జిల్లాలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్​ను ఈ రోజు ప్రారంభించామని… రేపటి నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లా ప్రజలు దానిని వినియోగించుకోవాలని మంత్రి హరీశ్​ రావు సూచించారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్​, జడ్పీ వైస్ ఛైర్​పర్సన్ లావణ్య రెడ్డి, జిల్లా అధికారులు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Electricity : విద్యుత్ సరఫరా నిలిపివేశారని అధికారిపై దాడి

ABOUT THE AUTHOR

...view details