తెలంగాణ

telangana

ETV Bharat / state

‘రవాణా’.. రోడ్డెక్కుతుందా బిరానా! - ఆర్టీసీ రవాణా

సామాన్యుడి రవాణా సాధనం ఆర్టీసీ బస్సు ‘లాక్‌డౌన్‌’లో ఉంది. బస్సులు రోడ్లెక్కేది మేలోనా, జూన్‌లోనా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లోని ఐదు ఆర్టీసీ డిపోల పరిధిలో రూ.కోట్లల్లో ఆదాయం పోయింది. డిపోలను, బస్సులను, వాటి ఇంజిన్లు, బ్యాటరీలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ కొందరు సిబ్బందితో అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎప్పుడు విధుల్లో చేరమని చెప్పినా బస్సులతో సహా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కొన్ని బస్సులను వలస కార్మికులు, ‘కరోనా’తో పోరాటం చేస్తున్న సిబ్బందిని తరలించేందుకు వినియోగిస్తున్నారు.

medak district rtc latest news
medak district rtc latest news

By

Published : May 7, 2020, 2:33 PM IST

మెదక్‌ జిల్లాలో ఏకైక బస్సు డిపో మెదక్‌ పట్టణంలో ఉంది. డిపో పరిధిలో 40 ఆర్టీసీ బస్సులున్నాయి. బస్సుల నిర్వహణకు ఎలక్ట్రీషియన్లు, మెకానిక్కులు, అసిస్టెంట్లు ఇద్దరు చొప్పున, ఒక సూపర్‌వైజర్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. బ్యాటరీలను ఛార్జింగ్‌ చేస్తున్నారు. ఇంజిన్లు, ఏసీ పనితీరు, టైర్‌లో గాలి తనిఖీ చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా అప్పటికప్పుడు బస్సులతో సేవలందించేలా సిద్ధంగా ఉంచుతున్నారు. 24 గంటల పాటు అత్యవసరంగా 10 మంది డ్రైవర్లు అందుబాటులో ఉంటున్నారు. ఆర్టీసీ భద్రతా సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉంటున్నారు.

లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు రూ.6.53 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని మెదక్‌ డిపో మేనేజర్‌ జాకీర్‌హుస్సేన్‌ తెలిపారు. బస్సుల్లో ఇంజిన్ల పరంగా పొరపాట్లు లేకుండా మెకానిక్కులతో సరిచేయిస్తున్నామని చెప్పారు.. ప్రభుత్వాదేశాలతో నడపడానికి సిద్ధమని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details