మెదక్ లోక్సభ స్థానం నుంచి తెరాస ఎంపీ అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి పట్టణానికి ఎంఎంటీఎస్ రైలు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తెరాస ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
మళ్లీ గెలిపించండి... మరింత అభివృద్ధి చేసి చూపిస్తా - sangareddy
మెదక్ లోక్సభ తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
మరోసారి అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు