Kodandaram: ప్రజల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్లో జిల్లా స్థాయి రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
'ప్రభుత్వం ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతుంది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని అడిగితే అరెస్ట్ చేసి స్టేషన్కు పంపడం దారుణం. మల్లన్నసాగర్ రైతులు న్యాయం చేయమని అడిగినందుకు ఆ గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టారు. ప్రజల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవడమంటేనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం.'