స్వయంగా కారు నడుపుతూ ఈ అడవుల్లో తిరిగానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సాపూర్ నుంచి సంగారెడ్డి, తుప్రాన్, హైదరాబాద్‌కు ఫియెట్ కారులో తిరిగానని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సినిమా షూటింగ్‌ల కోసం నర్సాపూర్ అటవీప్రాంతాన్నే ఎంపిక చేసుకునేవారని అన్నారు. ఈ అడవుల్లో చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయని వివరించారు.
తెలంగాణ ధనిక రాష్ట్రమే..
సమష్టికృషితో నర్సాపూర్ అటవీప్రాంతానికి పునర్జీవం వచ్చిందని తెలిపారు. తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదు.. డబ్బులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ కచ్చితంగా 100 శాతం ధనిక రాష్ట్రమేనని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల ఆదాయం లేకపోవడం వల్ల సగం వేతనాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నాయని చెప్పారు.