తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీకోదండ రామాలయంలో వైభవంగా కార్తిక పూజలు - మెదక్ జిల్లా తాజా వార్తలు

శ్రీకోదండ రామాలయంలో వైభవంగా కార్తిక పూజలు జరిపారు. లోక కల్యాణార్థం ఏటా ఈ ప్రత్యేక పూజలు జరుపుతామని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు.

karthika special puja at sri kodanda ramalayam in medak
శ్రీకోదండ రామాలయంలో వైభవంగా కార్తిక పూజలు

By

Published : Dec 4, 2020, 1:30 PM IST

కార్తిక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో తిమ్మనగారి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. భవాని చిదంబర స్వామికి సంకట విమోచన, చతుర్థి సహిత, ఆరుద్ర నక్షత్ర పూర్వక వ్రతం, రుద్ర హవనము, నూట పదహారు లీటర్ల క్షీరాభిషేకం చేశారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం వేదమంత్రాల మధ్య వైభవంగా జరిగింది.

కార్తికమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని లోక కల్యాణార్థం ఏటా క్షీరాభిషేకం నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు భాష్యం మధుసూదన ఆచార్యులు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుడిని వేడుకున్నామని వెల్లడించారు. ఇది పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం అని ఆయన పేర్కొన్నారు. అనంతరం మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు.

శ్రీకోదండ రామాలయంలో వైభవంగా కార్తిక పూజలు

ఈ కార్యక్రమంలో శ్రీనివాస శర్మ, సునీల్ శుక్ల, వేదపండితులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సంగం భీమలింగం వద్ద కార్తిక దీపారధనలు

ABOUT THE AUTHOR

...view details