ఆరుగాలం కష్టపడి ఓ రైతు పండించిన కంది పంట అగ్నికి ఆహుతయింది. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట శివారులో జరిగింది.
కంది పంటకు నిప్పు..రూ. 40 వేల వరకు నష్టం - Medak District Latest News
ఆ రైతు ఆరుగాలం కష్టపడి కంది పంట పండించాడు. చేతికొచ్చిన పంటను కోశాడు. దాన్ని ఒక్కదగ్గరగా కుప్పపోశాడు. ఆ తర్వాత గుర్తు తెలియని దుండగుడెవరో పంటకు నిప్పు పెట్టాడు. చేతికొచ్చిందనుకున్న పంట అగ్నికి ఆహుతవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
కల్వకుంట శివారులో కంది పంట అగ్నికి ఆహుతి
గ్రామానికి చెందిన మన్నే స్వామి 2 ఎకరాల భూమిలో కంది సాగు చేశాడు. కంది పంటను కోసి నూర్పిడి కోసం ఒక్క దగ్గర కుప్ప పోశానని రైతు తెలిపాడు. దానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఆగ్నికి ఆహుతయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.40 వేల వరకు పంట నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.